ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం మరియు శ్లేష్మం నుండి వారం రోజుల్లో విడుదల పొందవచ్చు. – మన ఆరోగ్యం - Health Tips Galaxy

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 6 May 2022

ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం మరియు శ్లేష్మం నుండి వారం రోజుల్లో విడుదల పొందవచ్చు. – మన ఆరోగ్యం

ఈ క్రింది పద్దతులను ఉపయోగించడం ద్వారా మన ఊపిరితిత్తుల యొక్క పనితీరును మెరుగుపరచవచ్చు. మరియు ఊపిరితిత్తులలో పేరుకుపోయిన  కఫం మరియు శ్లేష్మం నుండి విడుదల పొందవచ్చు. ముందుగా మనం ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. మనం తీసుకున్న గాలి శ్వాస రంధ్రాల ద్వారా శ్వాస నాళాలను చేరుతుంది. ఈ శ్వాసనాళాల నుండి చిన్న శ్వాస నాళాలను చేరుతుంది. అక్కడ నుంచి ఉపశ్వాస నాళాలకు చేరుతుంది. అలా ఉప శ్వాసనాళాలు చిన్న చిన్న శాఖలుగా విభజింపబడి మొత్తం ఊపిరితిత్తుల అంతా వ్యాపిస్తాయి.

ఇలా వ్యాపించిన గాలి మొత్తం ఊపిరితిత్తుల యొక్క తిత్తులలోనికి చేరుతుంది.ఈ మొత్తం ప్రక్రియ జరిగినప్పుడు ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు జరుగుతాయి. సంకోచ, వ్యాకోచాలు జరిపినప్పుడు ఊపిరితిత్తులు ఉబ్బుతు మరియు ముడుచుకుంటాయి. ఈ తిత్తులు గాలితో నిండినప్పుడు ఆక్సీకరణ జరుగుతుంది అనగా ఆక్సిజన్ రహిత రక్తము ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను తిత్తుల లోనికి విడుదల చేస్తుంది. ఈ విధంగా ఊపిరితిత్తులు పనిచేస్తాయి.

ఈ తిత్తులు ద్రాక్ష గుత్తులులాగ ఉంటాయి. వీటిలో శ్లేష్మం మరియు కఫంతో నిండి ఉన్నప్పుడు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. దీని వల్ల అనారోగ్యాలు తలెత్తడం జరుగుతుంది. కఫం మరియు శ్లేష్మం నుండి విడుదల పొందడానికి ఈ చిట్కాను ఉపయోగించవచ్చు. ఆవిరి పట్టడం ద్వారా మనకు మంచి విడుదల కలుగుతుంది. ఈ ఆవిరి పెట్టే నీటిలో పసుపు లేదా తులసి ఆకులు లేదా యూకలిప్టస్ ఆకులు వేసి పట్టడం వల్ల కఫం మరియు శ్లేష్మం కరిగి బయటకు పంపుతుంది. అంతే కాకుండా వేప పుల్లలు నమలడం వలన కూడా శ్లేష్మం బయిటకు పంపుతుంది.  మరియు రోజు ఉదయం అల్పాహారం తీసుకోకుండా నిమ్మరసం మురియు తేనె ను కలిపి తీసుకోవాలి. 

ఇలా 1గంట లోపు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా వారం రోజుల పాటు తీసుకోవడం వలన కఫం మరియు శ్లేష్మం కరిగి బయటకు పంపిస్తాయి. మరియు బ్రితీంగ్ వ్యాయామాలు చేయడం ద్వారా కూడా కొంచెం ఫలితాం ఉంటుంది. ఇంక  పడుకునే సమయంలో కాళ్ళ క్రింద ఎత్తు పెట్టుకొవడం ద్వారా కఫం మరియు శ్లేష్మం పైకి నెట్టుతుంది. దీని ద్వారా కూడా కఫం మరియు శ్లేష్మం తగ్గుతుంది. ఈ పద్దతులను ఉపయోగించడం ద్వారా కఫం మరియు శ్లేష్మం తగ్గి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది..Post Views:
62No comments:

Post a Comment

Post Bottom Ad

Pages