ఈ సమ్మర్ లో ముఖ్యంగా అందరూ చేసే ప్రాబ్లం సన్ టాన్. ఎండలో బయటకు వెళ్లి వస్తే చాలు మన చర్మం పై మురికి పేరుకుపోయి నల్లగా మారిపోతుంది. దీని కోసం పార్లర్ కు వెళ్తున్నారా. డీ టాన్ చేయించుకోవాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. మరియు పార్లర్ ఉపయోగించే క్రీమ్స్ వలన మన చర్మం పాడవుతుంది. దీనికి మన ఇంట్లోనే వుండే కొన్ని పదార్థాల్ని ఉపయోగించి ఈ చిట్కాను తయారు చేసుకుంటే ఇంట్లోనే మన చర్మాన్ని తెల్లగా చేసుకోవచ్చు. మరియు చర్మం తాజాగా ఉండేలాగా చేసుకోవచ్చు. ఈ చిట్కా చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది.
ఈ చిట్కాను రెండు స్టెప్స్ లో చేసుకోవాలి. మొదటిగా స్క్రబ్ ను తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక చిన్న బౌల్ లో మనం ఉపయోగించే ఏదైనా ఒక ప్యాకెట్ కాఫీ పౌడర్ ను తీసుకోవాలి. దానిలో ఒక స్పూన్ ఉప్పును చేర్చాలి. అందులో ఒక నిమ్మ చెక్క రసాన్ని కలపాలి. ఇలా మూడింటిని కలపడం ద్వారా మన స్క్రబ్ తయారవుతుంది. బాడీలో ఏ భాగంలో అయినా ఉపయోగించుకోవచ్చు. ముఖానికి ఉపయోగించేటప్పుడు మాత్రం ఉప్పు స్థానంలో పంచదారను ఉపయోగించాలి. ఈ మిశ్రమాన్ని మన శరీర భాగంలో అప్లై చేసి బాగా స్ర్కబ్ చేయాలి.
ఇలా ఒక 10 నిమిషాలు చేసి చల్లటి నీటితో ఒక టవల్ ఉపయోగించి పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పరిశీలిస్తే మనం స్క్రబ్ చేసిన ప్రాంతంలో మునుపటి కంటే చాలా తేడా కనిపిస్తుంది. అంతే కాకుండా చర్మం పైనున్న డెడ్ సెల్స్ అన్ని తొలగించబడతాయి. మరియు కాంతివంతంగా తయారవుతాయి. సన్ టాన్ మొత్తం శుభ్రం చేయబడుతుంది. ఆ తర్వాత రెండో ప్రక్రియను చేయాలి దీనిని ప్యాక్ కింద ఉపయోగిస్తారు. ఈ ప్యాక్ వేసుకోవడం ద్వారా ముఖము మరియు శరీర భాగాలు ఫ్రెష్ గా తయారవుతాయి.
ఈ ప్యాక్ ను తయారు చేయడానికి ఒక టీస్పూన్ కాఫీ పౌడర్ ను, పసుపు మరియు బేకింగ్ సోడాను కలుపుకోవాలి. అందులో ఒక చెక్క నిమ్మరసంలో కలుపుకోవాలి. ఈ నిమ్మరసం ప్లేస్లో టమాటా జ్యూస్ ను ఉపయోగించవచ్చు. ఈ ప్యాక్ ను ముఖానికి ఉపయోగించాలి అంటే బేకింగ్ సోడా ప్లేస్లో పంచదారను ఉపయోగించాలి. ఈ కలిపిన మిశ్రమమును టాన్ ఉన్న భాగంలో అప్లై చేయాలి. ఈ మిశ్రమము పలుచగా ఉంటుంది. ఇలా పలుచగా ఇష్టపడకపోతే దానిలో కొంచెం శనగపిండిని కలుపుకోవచ్చు. అలా తయారైన మిశ్రమాన్ని శరీర భాగాలపై అప్లై చేసి ఒక పావుగంట సేపు ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఆ తర్వాత మన పరిశీలిస్తే చాలా తేడా కనిపిస్తుంది. టాన్ మొత్తం శుభ్రం అయిపోతుంది. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. దీని ద్వారా మనం పార్లర్ లో టైమ్ స్పెండ్ చేయనవసరం లేదు మరియు ఖర్చు కూడా తగ్గుతుంది.
Post Views:
301
No comments:
Post a Comment