వారానికి ఒకసారి రాస్తే చాలు మీ జుట్టు 100రెట్లు ఒత్తుగా పెరుగుతుంది – మన ఆరోగ్యం - Health Tips Galaxy

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 2 May 2022

వారానికి ఒకసారి రాస్తే చాలు మీ జుట్టు 100రెట్లు ఒత్తుగా పెరుగుతుంది – మన ఆరోగ్యం

      ఇప్పుడు అందరికీ ఎక్కువగా ఉండే సమస్య జుట్టు రాలడం. కొంతమందికి ఐతే బట్ట తల కూడా వస్తుంది. మగవారిలో బట్ట తల ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య తగ్గించుకోవడానికి రకరకాల ఆయిల్స్ వాడతారు. కానీ దానివలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. రకరకాల ఆయిల్స్ వాడి విసిగిపోయిన వారు ఒకసారి ఈ హెయిర్ టానిక్ యూస్ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ హెయిర్ టానిక్ యూస్ చేయడం వలన జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగడమే కాకుండా చుండ్రు, దురద , చివర్లు చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి. 

     ఈ హెయిర్ టానిక్ తయారు చేసుకోవడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.దీనికోసం కావలిసినవి ఉల్లిపాయలు, ఉసిరికాయ, ఆముదం, మెంతులు. మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు తీసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక ఉసిరి కాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల మెంతులు అరగ్లాసు నీటిలో నానబెట్టి రాత్రంతా అలా ఉంచాలి. మిక్సి జార్ తీసుకుని ఉల్లిపాయ ముక్కలు , ఉసిరికాయ ముక్కలు, మెంతులు నానబెట్టిన నీళ్ళు మాత్రమే వేసి మిక్సి పట్టుకోవాలి. 
     తర్వాత ఏదైనా క్లాత్ లేదా ఫిల్టర్ చేసుకునే దానితో ఈ మిశ్రమాన్ని పిల్టర్ చేసి జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. ఈ జ్యూస్ లో ఒక చెంచా కాస్టర్ ఆయిల్ వేసి బాగా కలపాలి. కాస్టర్ ఆయిల్ బదులుగా బాదం నూనె లేదా కొబ్బరి నూనె కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ టానిక్ ఏదైనా గాలి వెళ్లని గాజు సీసాలో పోసి నిల్వ ఉంచుకోవచ్చు. ఈ టానిక్ స్ప్రే బాటిల్ లో వేసి స్కాల్ఫ్ మరియు జుట్టు మొత్తం పట్టేలాగా అప్లై చేసుకోవాలి. ఇది ఆయిల్ పెట్టిన జుట్టు లేదా పొడి జుట్టు మీద కూడా అప్లై చేసుకోవచ్చు. 
      ఇది అప్లై చేసుకున్న తర్వాత 45నిముషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ తో తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి రాస్తే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. బట్టతల ఉన్నవారికి కూడా కొత్త జుట్టు వస్తుంది. ఇలా వారానికి ఒకసారి లేదా మూడు సార్లు అప్లై చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ హెయిర్ టానిక్ ఉపయోగించి బట్ట తల ఉన్నవారికీ కూడా పెరిగేలా చేయవచ్చు. ఈ చిట్కా మీరు కూడా ట్రై చేసి మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేసుకోండి Post Views:
45No comments:

Post a Comment

Post Bottom Ad

Pages