మొలకెత్తిన గింజలు చాలా మంది తినడానికి ఇష్టపడరు. మొలకలు తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగదు అని భయంతో అల్పాహారంలో మొలకెత్తిన గింజలు తీసుకోవడానికి ఇష్టపడరు. వాటికి బదులు అల్పాహారంలో ఇడ్లీ, దోశ వంటివి తీసుకొంటున్నారు. ఇలా ఉడికించిన ఆహారం ద్వారా రెండు విధాలుగా మనకి నష్టం కలుగుతుంది.వాటిలో మొదటిది ఉడికించిన ఆహారంలో వాటి పోషకాలను కోల్పోవడం జరుగుతుంది. రెండవదిగా ఆ ఆహారంలో ఉప్పు మరియు నూనె ఉపయెగించడం ద్వారా మనకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అందువలన అల్పాహారంలో మొలకలు బదులు మరికొన్ని విత్తనాలను చేర్చుకోవచ్చు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవి వేరుశెనగలు, పుచ్చ పప్పు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, బాదం, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష వంటివి చౌక ధరలకు లభించే విత్తనాలను ఉపయెగించవచ్చు. ఈ విత్తనాలను ఒక్కోకటిగా గుప్పెడు చొప్పున వేరువేరుగా ముందు రోజు రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయం అల్పాహార సమయంలో తిసుకోవాలి.
ఇలా అల్పాహారంలో తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మరియు మొలకెత్తిన విత్తనాలు వలన కలిగే ప్రయోజనాలు ఈ విత్తనాలను తినడం వలన కూడా లభిస్తాయి. ఈ విత్తనాలను బరువు పెరగాలనుకుంటున్నవారు కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటే వారికి ఈ విత్తనాలు ఉపయోగపడతాయి. అధిక బరువు ఉన్నవాళ్లు ఇవి సమ మోతాదులో తీసుకుంటే వారికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. వేరుశనగ లో ఉన్న ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది మరియు జీర్ణక్రియలో సమతుల్యతను ఏర్పరుస్తుంది.
వేరుశనగలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి మరియు కాన్సర్ రాకుండా ఇవి అడ్డుకుంటాయి. పుచ్చ గింజలలో అనేక పోషక విలువలు ఉంటాయి. విటమిన్ బి అధికంగా ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల గుండె జఋ్బల ముప్పు నుండి తప్పించుకొవచ్చు.vఈ గింజలు తీసుకోవడం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పడుతుంది. గుమ్మడి గింజల విత్తనాలను తీసుకోవడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి.
ఈ గింజలు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కండరాలు, ఎముకల నొప్పి, జుట్టు రాలడం తగ్గుతాయి. మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. మొటిమలు రాకుండా నియంత్రిస్తుంది. ఎండుద్రాక్షలో ప్రోటీన్స్, డైటరీ ఫైబర్, విటమిన్ బి1, బి2, బి 3, బి 5, విటమిన్ ఎ మరియు సి లు కూడా అధికంగా ఉంటాయి. అందువలన జిమ్ చేసే వారు ఎండు ఖర్జూరం అధికంగా తీసుకోమంటారు. నానబెట్టిన బాదంలో ఒమేగా 3, విటమిన్ ఇ ప్రోటీన్స్ మరియు పీచు పదార్థాలతో నిండి ఉంటాయి. అందువలన ఇవి శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఉపయోగపడతాయి.
Post Views:
219
No comments:
Post a Comment