ఈ జపనీస్ సీక్రెట్ ఒక్కసారికే మీ చర్మాన్ని తెల్లగా మారుస్తుంది. మెడ, చేతులు నల్లగా ఉన్నవారు తప్పకుండా ప్రయత్నించండి. – మన ఆరోగ్యం - Health Tips Galaxy

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 4 April 2022

ఈ జపనీస్ సీక్రెట్ ఒక్కసారికే మీ చర్మాన్ని తెల్లగా మారుస్తుంది. మెడ, చేతులు నల్లగా ఉన్నవారు తప్పకుండా ప్రయత్నించండి. – మన ఆరోగ్యం

కొంత మంది మెడ నల్లగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఎండాకాలంలో శరీరంపై కూడా ఎండ వేడి వల్ల చెమట పట్టి దుమ్ము పేరుకుపోయి చేతులు, మెడ నల్లగా మారిపోతుంటాయి. వీటన్నింటికీ ప్రతిసారి బ్లీచ్ లాంటివి వాడడం అంత శ్రేయస్కరం కాదు. అలాగని  వదిలేయడం వలన చర్మ కణాలు దెబ్బతింటాయి. అందుకే మన ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలతో స్క్రబ్ మరియ ప్యాక్ తయారుచేసుకొని చర్మాన్ని తెల్లగా ఎలా మార్చుకోవాలి తెలుసుకుందాం. దీని కోసం మనం ముఖ్యంగా తీసుకునే పదార్థం సగ్గుబియ్యం. 

కొన్ని సగ్గుబియ్యాన్ని మిక్సీలో మెత్తగా పొడిలా చేసుకోవాలి. తర్వాత స్క్రబ్ కోసం ఒక గిన్నె తీసుకుని రెండు స్పూన్ల సగ్గుబియ్యం పొడి వేసుకోవాలి. దీనిలో ఒక అర చెక్క టమాటారసం, ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి. టమాటా రసం చర్మానికి పడనివారు కీరా రసం, పచ్చి పాలు వాడవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నల్లగా ఉన్న ప్రదేశంలో అప్లై చేసి నెమ్మదిగా కట్ చేసిన టమాటా చెక్కతో స్క్రబ్ చేస్తూ ఉండాలి. ఇలా ఐదు నిమిషాల పాటు చేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి. 

తర్వాత ప్యాక్ కోసం ఒక గిన్నె తీసుకొని రెండు స్పూన్ ల సగ్గుబియ్యం పొడి, రెండు స్పూన్ల శెనగపిండి, అర చెక్క టమాటా రసం, ఒక చిన్న కాఫీ పొడి ప్యాకెట్ ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలిపి దీనిని నల్లగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత మామూలు నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి కనీసం రెండు సార్లు చేయడం వలన మెడపై, చేతుల పైన పేరుకున్న నలుపుని తొలగించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. సగ్గుబియ్యం లేదా సాబుదానాలో ఫినోలిక్ యాసిడ్‌లు మరియు ఫ్లేవనాయిడ్‌లు ఉంటాయి – అద్భుతమైన ఫ్రీ రాడికల్ టెర్మినేటర్‌లు అయిన యాంటీఆక్సిడెంట్‌లు ఇవి.

  ఇది కొత్త చర్మ కణాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది, చక్కటి గీతలు మరియు ముడతలను దాచిపెడుతుంది. అలాగే టమాటా రసం చర్మాన్ని క్లీన్ చేసి నలుపు మృతకణాలు తగ్గిస్తుంది. శెనగపిండి చర్మాన్ని కాంతివంతం చేసి  సమస్యను తగ్గిస్తుంది. పెరుగు చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తుంది. కాఫీ పొడి ముఖానికి అప్లై చేసి చర్మం పై ఉన్న ఆయిల్ ని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. ఇందులో వాడిన పదార్థాలు సహజమైనవి కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.Post Views:
510No comments:

Post a Comment

Post Bottom Ad

Pages