ఇంట్లో దోమలు, ఈగలు ఎక్కువగా ఉన్నవారు వాటితో చాలా ఇబ్బందులు పడుతుంటారు. దోభలు కుట్టడం వలన ఈగలు ఆహారపదార్థాలపై వాలడం వలన అనేక రకాల వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. వాటిని తొలగించుకోవడానికి అనేక రకాల స్ప్రే బాటిల్స్ , జెల్స్ అందుబాటులో ఉన్నా సరైన ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మనం ఇంట్లోనే కొన్ని పదార్థాలను ఉపయోగించి తయారు చేసుకునే రెమిడీలతో మంచి ఫలితాన్ని ఇస్తున్నాయని ఉపయోగించిన వారు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట కొన్ని కర్పూరం బిళ్ళలు తీసుకొని వాటిని మెత్తగా దంచుకోవాలి. దేవుడి దగ్గర ఉపయోగించి కర్పూరం బిళ్ళలు ఈ రెమిడీ కోసం ఉపయోగించబోతున్నాం.
దంచి పెట్టుకున్న కర్పూరం పొడిని ఒక ప్రమిదలో వేసి దానిలో నిండుగా వేప నూనె వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిపి ఒక లావుపాటి ఒత్తి వేయాలి. తర్వాతి వత్తిని వెలిగించడం వలన మంటతో పాటు వేపనూనె, కర్పూరం మండి ఘాటైన పొగ వస్తుంది. ఇది మనకు ఇబ్బంది లేకపోయినా ఈగలు, దోమలు ఆ వాసనకు ఉండలేక ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతాయి. ఈ దీపం వెలిగించే ముందు తలుపులు అన్నీ వేసి ఆ తర్వాత వెలిగించడం వలన ఇంట్లో ఉన్న దోమలు, ఈగలు చచ్చిపోతాయి. కొత్తవి లోపలికి రాకుండా ఉంటాయి. ఎండాకాలం ఈగల సమస్య బాగా ఎక్కువైపోతుంది. ఈసారి ఈ చిట్కాలు పాటించి చూడండి మంచి ఫలితం ఉంటుంది.
ఇక రెండవ చిట్కా కోసం మనం బిర్యానీ ఆకులు తీసుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనిమీద కొద్దిగా కర్పూరం పొడిని, కొద్దిగా వేప నూనె వేసి ఈ ఆకులను మండించాలి. ఈ ఆకులు కొద్దిగా మండిన తరువాత వీటి నుండి పొగ వస్తుంది. ఈ పొగ వలన ఈగలు, దోమలు సమస్య తగ్గిపోతుంది. ఇలా తక్కువ ఖర్చులో ఇంట్లో ఈగలు, దోమల సమస్య నివారించుకోవచ్చు. చిన్న పిల్లలు ఉన్నవారు వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి. బట్టలు వంటి వాటికి దూరంగా పెట్టుకోవాలి. సాయంత్రం సమయంలో ఇంట్లో వెలిగించడం వలన దోమలు ఇంట్లోకి రాకుండా పిల్లలు వాటి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
Post Views:
1,498
No comments:
Post a Comment