డ్రై ఫ్రూట్స్ అనగానే మనకు జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాలు ఇవే తెలుసు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని తెలుసు. ద్రాక్ష, జీడిపప్పులాంటివే కాకుండా బయట మార్కెట్లో ఇతర దేశాలనుండి రవాణ చేసుకొంటున్న మరిన్ని డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి.
అందులో ఒకటైన బ్లూ-బెర్రీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సామాన్యంగా అన్ని ఋతువుల్లో లభించగల పళ్లు ఈ బ్లూ-బెర్రీస్. ఐస్ క్రీం, మిల్క్-షేక్ వాటిల్లో బ్లూ బెర్రీస్ రుచిని ఆస్వాదిస్తూ ఉంటాము. ఇంకొందరు ఫ్రూట్స్ డైట్-లో కూడా వాడుకుంటారు. బ్లూ బెర్రీస్-ను అలానే తినవచ్చు. పులుపు, తీపి మిశ్రమంలో మంచి రుచి కలిగివుంటుంది.
బ్లూ బెర్రీస్ ఉపయోగాలు ఏంటి..!
•జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంపొందిస్తుంది ,
•మెదడు చురుగ్గా ఉండటంలో సహకరిస్తుంది.
-బ్లూ బెర్రీస్-లో రోగ-నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. బ్రెయిన్ సప్లిమెంట్స్ అనే చెప్పవచ్చు.
•ముఖ్యంగా వయస్సు పైబడే కొద్దీ మన జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వారికి బ్లూ బెర్రీస్ చాలా సహాయపడిందని, యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి వారు అధ్యయనం చేసారు.
•బ్లూ బెర్రీస్-లో ఉన్న కొన్ని యాంటి-ఆక్సిడెంట్స్, మెదడు కణాలకు కార్బో హైడ్రేట్-ను గ్రహించెలా చేస్తాయి, ఈ ప్రక్రియ వల్ల మన మెదడు ఆక్టివ్-గా ఉంటుంది.
•జీర్ణ వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది.
•విటమిన్-సి అంశం లభించడం వల్ల అలసటను దూరం చేస్తుంది.
•ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ డిఎన్ఎ డ్యామేజ్ చేసే ఫ్రి-రాడికల్స్ నుండి శరీరానికీ రక్షణనిస్తుంది.
•ఇందులో ఉన్నా బి-17 అనే విటమిన్ క్యాన్సర్ సెల్స్-కు విరుద్ధంగా పోరాడుతుంది.
•బ్లూ బెర్రీస్ ఆక్సైడేటివ్ స్ట్రెస్-ను తగ్గిస్తుంది. ఇలా చేయటం వల్ల చర్మం ముడతలు పడటం,కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ రావటాన్ని తగ్గించవచ్చు.
•బ్లూ బెర్రీస్ బ్లడ్-ప్రెషర్ తగ్గిస్తుంది కాబట్టి గుండెపోటు సమస్యలను రానివ్వదు.
•రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ మరియు వ్యర్థ పదార్థాలను ప్యురిఫై చేస్తుంది.
•బ్లూ బెర్రీస్-లోని విటమిన్-సి,కె మరియు మ్యాంగనీస్ అంశాలు రోగ నిరోధక శక్తిని పెంచటానికి సహాయ పడుతుంది.
•వారానికి మూడు సార్లు బ్లూ-బెర్రీస్ సేవించటం వల్ల మహిళల్లో హృద్రోగం తగ్గుతుంది.
•బరువు తగ్గించుకోవడానికి బెస్ట్ ఫ్రూట్స్ బ్లూ బెర్రీస్.
•మూత్రపిండాల ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది.ఇందులోని కెరాటిన్ గుణాలు కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
బ్లూ బెర్రీస్ లోని పోషకాలు శరీరానికి అందాలంటే, వారానికి రెండు నుండి మూడు సార్లు ఈ పళ్లు తినే అలవాటు చేసుకోండి. పైన చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలు అన్ని సొంతమవుతాయి.
Post Views:
47
No comments:
Post a Comment