ఈ నైట్ నుండే స్టార్ట్ చేయండి వారంలో తప్పకుండా కలర్ మారుతారు - Health Tips Galaxy

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 9 March 2022

ఈ నైట్ నుండే స్టార్ట్ చేయండి వారంలో తప్పకుండా కలర్ మారుతారు

అంత పుట్టినప్పటి నుంచి తెల్లగా ఉండరు. కొందరూ చామనచాయగా, కొందరు తెల్లగా ఉంటారు. చామనచాయగా ఉన్న మొహం తెల్లగా అవ్వాలి అని  పార్లర్  చుట్టూ తిరగడం, రకరకాల క్రీములు రాయడం చేస్తూ ఉంటారు. కానీ వాటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.  కెమికల్స్ ఉన్న   క్రీములు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఈ చిట్కా ట్రై  చేసినట్లయితే ఒక వారం రోజుల్లో మీరు తప్పకుండా రంగు మారతారు. ఈ రెమెడీ చేసుకోవడానికి కావాల్సినవి   క్యారెట్, బియ్యప్పిండి.

ఈ రెమెడీ చేసుకునే విధానం నాలుగు మంచి రంగు ఉన్న ఫ్రెష్ క్యారెట్స్ తీసుకుని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని వడకట్టుకుని జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్ గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో సగం అయ్యేంతవరకు మరిగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి   జ్యూస్ లో  సరిపడినంత బియ్యపిండి వేసుకుని ఉండలు లేకుండా పౌడర్ లాగా అయ్యేంతవరకు పిండి వేసుకుంటూ కలుపుకోవాలి.

దీనిలో రెండు స్పూన్ల పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. రోజు స్నానం చేసేటపుడు నలుగు పిండిలాగా  రాసుకోవాలి. ఈ పిండిని కొంచెం తీసుకుని పచ్చి పాలు లేదా నీళ్లు వేసి కలుపుకుని ఒంటికి రాసుకోవాలి. ఇలా వారం రోజులు చేసినట్లయితే మీ చర్మం రంగు మారుతుంది. ఈ పిండి రాసుకున్న తర్వాత సబ్బు పెట్టుకోకూడదు. కావాలంటే సబ్బు పెట్టుకున్న తర్వాత  ఈ పిండిని రాసుకోవచ్చు.

ఇలా రోజు చేయడానికి సమయం లేనివాళ్లు వారానికి రెండు సార్లు ఐనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫేసుకి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకుని  1 టేబుల్ స్పూన్ ఈ బాత్ పౌడర్ వేసుకుని, రెండు స్పూన్ల  పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. ఒక 15నిముషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఈ  ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం పై నల్లని మచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా పోయి ముఖం చాలా క్లియర్ గా,స్మూత్ గా కాంతివంతంగా తయారవుతుంది.

ఈ ప్యాక్ కలుపుకునేటపుడు పెరుగు బదులుగా అలోవెరా జెల్  లేదా తేనె కూడా వేసుకోవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ బాత్ పౌడర్ చిన్నపిల్లలకు కూడా ఉపయోగించవచ్చు. 

The post ఈ నైట్ నుండే స్టార్ట్ చేయండి వారంలో తప్పకుండా కలర్ మారుతారు appeared first on మన ఆరోగ్యం – Best Health Info.No comments:

Post a Comment

Post Bottom Ad

Pages