మీరు ఇప్పటి వరకు చూడని భయంకరమైన కాళ్ళ పగుళ్ళకు ఒక్కసారికె అద్భుతమైన రిజల్ట్స్ – మన ఆరోగ్యం - Health Tips Galaxy

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 8 March 2022

మీరు ఇప్పటి వరకు చూడని భయంకరమైన కాళ్ళ పగుళ్ళకు ఒక్కసారికె అద్భుతమైన రిజల్ట్స్ – మన ఆరోగ్యం

సీజన్ మారడం వలన నీటిని ఎక్కువగా తాగకపోవడం వలన కాళ్ళ పగుళ్లు ఏర్పడుతుంటాయి. కొంత మంది మాత్రం ఎక్కువగా పొలాల్లో పని చేయడం లేదా ఎక్కువగా నడవడం వంటి పనుల వలన పాదాల పగుళ్లు ఎక్కువగా ఉండి బాగా నొప్పి, చూడటానికి కూడా అసహ్యంగా ఉంటాయి. ఇలా పాదాలు పగిలి నొప్పి, రక్తం రావడం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఇప్పుడు చెప్పబోయే రెండు చిట్కాలతో కాళ్ళ పగుళ్లు తగ్గించుకోవచ్చు.

 దానికోసం మొదట మనం ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఈ నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక షాంపూ ప్యాకెట్ వేసుకోవాలి. మీరు వాడే ఏదైనా షాంపూ పర్వాలేదు. షాంపూలు ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకుని ఒక నిమ్మకాయను పూర్తిగా ఈ నీటిలో పిండేయాలి. ఈ నీటిని బాగా కలిపి పాదాలను వేడి నీటిలో పెట్టాలి. నీళ్ళు మరీ వేడిగా ఉండేలా కాకుండా పాదాలు భరించగలిగినంత వేడి ఉండేలా చూసుకోవాలి. 

ఒక 30 నిమిషాల తర్వాత మనం ఫుట్ స్క్రాపర్ మరియు ప్యూమిక్ స్టోన్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటితో పాదాలను రుద్దడం వలన పాదాలపై ఉండే మృతకణాలు, దుమ్ము, ధూళి తొలగిపోతాయి. ఇలా చేయడం వలన చాలా వరకు పాదాలపై పగుళ్లు పైన ఉండే మృతచర్మం తొలగి పాదాలు పగుళ్ళు తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత పొడిగుడ్డతో పాదాలను శుభ్రంగా తుడుచుకోవాలి.

 ఇప్పుడు ఫుట్ క్రీమ్ తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం ఒక గిన్నెలో ఒక టీస్పూన్ వ్యాజిలైన్ పెట్రోలియం జెల్లీ వేసుకోవాలి. ఇది అందరికీ అందుబాటులోనే ఉంటుంది. ఐదు, పది రూపాయలకు చిన్న బాటిల్స్ కూడా దొరుకుతాయి గనుక తెచ్చి పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. తరువాత ఇందులో ఒకటి స్పూన్ వెజిటేబుల్ ఆయిల్ వేసుకోవాలి లేదా మీరు కొబ్బరినూనె కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సిల్స్  బదులు బాదం ఆయిల్ లేదా ఆముదం నూనె వేసుకోవచ్చు. 

తరువాత కొంచెం పసుపు వేయాలి. పెట్రోలియం జెల్లీ కరగడానికి కొద్దిగా వేడి చేయాలి. ఒక గిన్నెలో కొద్దిగా వేడినీటిని తీసుకొని పెట్రోలియం జెల్లీ మిశ్రమం ఉన్న గిన్నెను ఆ వేడి నీటిలో పెట్టుకోవాలి. 2, 3 నిమిషాలకు ఇది మొత్తం బాగా కలిసి పోతుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న గిన్నెలో నిల్వ చేసుకొని ఫ్రిజ్లో పెట్టాలి. ఇది ఒక క్రీమ్ లా తయారవుతుంది. ఈ ఈ క్రీమ్ ను ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు పాదాలకు పట్టించి సాక్స్ వేసుకొని పడుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వలన పాదాలకు తేమ అందడంతో పాటు పగిలిన పాదాలు తిరిగి మామూలుగా అవుతాయి. నొప్పి, బాధ నుండి విముక్తి లభిస్తుంది.Post Views:
104No comments:

Post a Comment

Post Bottom Ad

Pages