అల్లం వెల్లుల్లి పేస్టు వాడటం వల్ల లాభాలేంటి నష్టాలేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ప్రతి వంటల్లో ను ఉపయోగిస్తూ ఉంటాము. మంచి రుచి మరియు వాసన కోసం ప్రతి ఒక్కరు అన్ని కూరలలో వేస్తూ ఉంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ను రోజు ప్రయోగించడం వలన కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. అల్లం మరియు వెల్లుల్లి లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి పేగులకు కడుపులో ఇమ్యూనిటీ బూస్టర్ గా ఉపయోగపడతాయి.
అల్లం మరియు వెల్లుల్లి జీర్ణక్రియకు అవసరమైన జీర్ణరసాలను ఉత్పత్తి చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అల్లం మరియు వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెరిగేలా చేస్తాయి రక్తనాళాలు వ్యాకోచించేలా చేస్తాయి. శరీరంలో చెడు బ్యాక్టీరియా ని బయటకు పంపిస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవడం మెదడు పనితీరు కూడా బాగుంటుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తాన్ని చిక్కబడకుండా చేస్తుంది.
కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. రోజు తీసుకోవడం వలన మన శరీరానికి అలవాటైపోయి మన శరీరం పై దాని ప్రభావం చూపించదు. ఏదైనా పండగలు శుభకార్యాలప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఉపయోగించాలి. వెల్లుల్లి పేస్ట్ ను ఎక్కువగా ఉపయోగించడం వలన కడుపులో ఇరిటేషన్ మొదలయ్యి విరోచనాలు అవ్వడం తేన్పులు వంటివి రావడం కడుపులో మంట జఠరాగ్ని లో మంట ఏర్పడతాయి.
అల్లం వెల్లుల్లి పేస్టు రోజు ఉపయోగించడం వలన టేస్ట్ మనకు అలవాటు అయిపోయి కొంచెం వేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్టు మల్లి మాట్లాడాలని ఇంకొంచెం మోతాదు పెంచడం జరుగుతుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలవుతాయి. అందుకే డాక్టర్లు అల్లం-వెల్లుల్లి పేస్ మసాలాలను తగ్గించండి లేకపోతే మానేయండి అని చెప్తారు. పూర్వం అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు నూరి వేసుకునే వాళ్ళు. మన ఇప్పుడు ఒకేసారి ఎక్కువగా చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకొని ఉపయోగిస్తున్నారు.
దీనివల్ల అల్లంవెల్లుల్లి పేస్టు లో ఉంటే మెడికల్ గుణాలన్నీ పోయి దాని వల్ల సరైన రుచి, వాసన కూడా ఉండదు. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఏమీ ఉండవు. ప్యాకేజ్డ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వలన కూడా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. వాటిలో నిల్వ ఉంచడం కోసం కలిపే రసాయనాలు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అందుకే ఇంట్లో అప్పటికి అప్పుడు తయారుచేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉపయోగించి వాసన, రుచిని ఆస్వాదించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
Post Views:
82
No comments:
Post a Comment