వారం రోజులు చాలెంజ్ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. పలుచగా అయిపోయిన జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది - Health Tips Galaxy

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 16 March 2022

వారం రోజులు చాలెంజ్ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. పలుచగా అయిపోయిన జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది

  ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు,  తీసుకునే ఆహారం వల్ల  ప్రతి ఒక్కరికీ జుట్టు రాలడం  బాగా ఎక్కువగా ఉంది. జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడం కోసం చాలా రకాల నూనెలను షాంపూలను మారుస్తుంటారు. కానీ వాటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాటిలో రసాయనాలు ఉండటం వల్ల  సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకొని నూనెను వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

ఈ నూనె  ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 4 పెద్దవి కలబంద మట్టలను  తీసుకొని శుభ్రంగా కడిగి అంచులను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు  వేయకూడదు కావాలంటే కొంచెం కొబ్బరి నూనె వేసుకోవచ్చు. దళసరిగా ఉన్న కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని  ముందుగా మిక్సీ పట్టుకున్న కలబంధ మిశ్రమాన్ని కడాయిలో వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు పావు కేజీ కొబ్బరి నూనె వేసుకోవాలి.

నూనెను కలుపుకుంటూ మరిగించుకోవాలి. తర్వాత మూడు చెంచాల మెంతులు వేసుకోవాలి. ఒక గుప్పెడు తాజా మందార ఆకులను కూడా వేసుకోవాలి. చిన్న మంట పెట్టుకొని బాగా మరిగించుకోవాలి.కలబంద మిశ్రమం  నుండి బయటకు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఆకులు కలబంద మిశ్రమం మొత్తం నల్లగా మారి నూనె  బయటకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నూనె  వడకట్టుకోవాలి. ఈ నూనె  రోజు రాసుకోవడం వలన జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడమే  కాకుండా మృదువుగా, నల్లగా, షైనీ గా మారుతుంది. 

ఈ నూనె రోజు రాత్రి పడుకునే ముందు రాసుకోవాలి. చిరాకుగా ఉంది అనుకున్న వాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసేయవచ్చు లేదా అలా ఉంచుకున్న పర్వాలేదు. ఇది  రోజు వాడడం వలన ఎన్నో రోజుల నుండి జుట్టు రాలి పరచబడిన జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.   మందార ఆకులను షాంపూ లో కలిపి  మిక్సీ పట్టుకుని స్నానం చేయడం వలన చెట్టు మృదువుగా, షైనీగా తయారవుతుంది. ఈ నూనె  కూడా ఇంట్లోనే తయారు చేసుకొని నాచురల్ గా జుట్టు అందంగా, ఒత్తుగా, పొడవుగా పెరిగే లాగా చేసుకోండి. ఈ నూనె వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంట్లో ఉండే వాటితోనే  ఈజీగా తయారు చేసుకోవచ్చు.

The post వారం రోజులు చాలెంజ్ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. పలుచగా అయిపోయిన జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది appeared first on మన ఆరోగ్యం – Best Health Info.No comments:

Post a Comment

Post Bottom Ad

Pages