చాలామంది పిల్లల్లో టీనేజ్ వచ్చినప్పటినుండి మొటిమలు రావడం మొదలవుతుంది. ఇవి తగ్గిపోయిన తరువాత కూడా నల్లటి మచ్చలను ముఖంపై మిగులుస్తాయి. చాలామంది మచ్చల వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ మచ్చలు తగ్గించుకోవడానికి రకరకాల కెమికల్ ట్రీట్ మెంట్ క్రీములు వాడుతూ ఉంటారు. కానీ మీ ఇంట్లోనే ఉండే రెండు పదార్థాలు మొటిమలు, మచ్చలు తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి అని మనకు తెలియదు. అవేంటో వాటితో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో, ఆ ఫేస్ ప్యాక్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు కావలసినవి మెంతి గింజలు.
మెంతి గింజల్లో విటమిన్ కె మరియు విటమిన్ సి ఉంటాయి, ఇవి చర్మంపై మచ్చలు మరియు నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతి గింజల ఫేస్ మాస్క్‌ని ఉపయోగించడం వల్ల చర్మంలోని మలినాలు తొలగిపోయి సహజసిద్ధంగా మెరుస్తాయి. కొన్ని మెంతి గింజలను రాత్రంతా నీటిలో లేదా పాలలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆవు పాలతో రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖం పై ఫేస్ ప్యాక్ గా అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత నెమ్మదిగా మసాజ్ చేసి తర్వాత మామూలు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. మెంతులలోని డయోస్జెనిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది, ఇవి మొటిమలకు చికిత్స చేస్తాయి మరియు మీ చర్మాన్ని తేమగా చేస్తాయి. మెంతి పొడి మరియు పచ్చి పాలు లేదా పెరుగుతో చేసిన ఫేస్ ప్యాక్‌ను రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల సన్నటి గీతలు తగ్గుతాయి మరియు మీ ముఖం యొక్క ఛాయ శరీరం లో ఇతర భాగాలతో సమానంగా ఉంటుంది.
మీరు మెంతి గింజలను ఉపయోగించి సహజ స్క్రబ్‌ను తయారు చేసుకుని తరుచూ వాడుకోవచ్చు. ఆవు పాలు అనేది చాలా పురాతన కాలంనుండి చర్మ రక్షణలో వాడుతున్ళ పదార్ధం, ఇది చర్మాన్ని సహజంగా శుభ్రపరచడానికి, తేమగా మరియు పోషణకు తరచుగా ఉపయోగించబడుతుంది. చాలా చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఆవు పాలను ఉపయోగిస్తాయి, ఎందుకంటే ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మానికి సహజమైన క్లెన్సర్ మరియు సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ముఖం పై మచ్చలు ఎక్కువగా ఉన్నవారు వారంలో కనీసం రెండు సార్లు ఈ ఫేస్ ప్యాక్ వాడుతూ ఉంటే నల్ల మచ్చలు తగ్గడంతో పాటు చర్మం రంగు కూడా మెరుగుపరచుకోవచ్చు.
The post మొటిమలు ఉన్న పాపకి రాత్రి ఈ క్రీమ్ రాసి ఉదయం చూసే సరికి ఒక్క మొటిమ కూడా లేదు. appeared first on మన ఆరోగ్యం – Best Health Info.
No comments:
Post a Comment