మనం చిన్నప్పుడు ఉసిరికాయలను కొంచెం కారం మరియు ఉప్పు కలిపి తినేవాళ్ళము. ఇలా రుచితోపాటు ఈ పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? భారతదేశంలో ఆమ్లా, గూస్బెర్రీ అని కూడా పిలువబడే ఉసిరి మీ చర్మం, జుట్టు మరియు ఆరోగ్యానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. పుల్లని మరియు ఆరోగ్యకరమైన ఈ పండు యొక్క శాస్త్రీయ నామం Polyanthus emblica మరియు దీనిలో పోషకాహారం సమృద్ధిగా ఉంటుంది.
ఉసిరికాయలతో ఊరగాయలు, ఆరోగ్యకరమైన మురబ్బాలుతో సహా చట్నీల తయారీ వంటి అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. భారతదేశంలో ఉసిరికాయ జ్యూస్ చేయడానికి ప్రసిద్ధి చెందింది. ఈ హెల్తీ డ్రింక్‌లో విస్తారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే విటమిన్ సి కంటెంట్ మరియు ఇతర ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి.
ఉసిరి గురించి తప్పక తెలుసుకోవలసిన వాస్తవాలు:
ఉసిరికాయ తినడం వల్ల మీ చర్మం నిగనిగలాడుతుందని మీకు తెలుసా? అవును, ఇది నిజం ఎందుకంటే ఇది యాంటీ ఏజింగ్‌లో సహాయపడుతుంది మరియు ఇతర చర్మ వ్యాధులను నిరోధిస్తుంది. చర్మం పై ముడతలు సాధారణంగా వయసు పైబడిన వారిలో కనిపిస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో మన ఆహారంలో విటమిన్ సి లోపం చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గించి చిన్న వయసులోనే ముడతలు ఏర్పడటానికి కారణమవుతుంది. దీని వలన అసలు వయసు కంటే పెద్ద వారిలాగా కనిపిస్తూ ఉంటారు.
ఇలాంటి వారు ఆహారంలో ఎక్కువగా ఉసిరిని చేర్చుతూ ఉండాలి. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఉసిరిని ఎలా ఆహారంలో చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి జ్యూస్‌ను ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల శరీరంలో విష వ్యర్ధాలను శుభ్రం చేయడంతో పాటు చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే ఉసిరికాయ కొబ్బరి లేదా నువ్వులతో రోటి పచ్చడి చేసుకొని కూడా తినవచ్చు. నోటికి రుచిగా ఉండడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
అలాగే ఉసిరి కాయలు ఎక్కువగా దొరికే సమయంలో చిన్న ముక్కలుగా కోసి ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు. ఇలా నిల్వ చేసుకున్న ఉసిరి ముక్కలను ప్రతిరోజు భోజనం చేసిన తరువాత రెండు ముక్కలను చప్పరించడం ద్వారా శరీరంలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఇలా ఎండబెట్టిన ఉసిరి ముక్కలను పొడిచేసి ప్రతిరోజు ఉదయం తేనెతో కలిపి తీసుకోవడం వలన కూడా విటమిన్ సి ని పొందవచ్చు. దానితోపాటు ఆకలి సమస్యలు, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు.
Post Views:
56
No comments:
Post a Comment